Sunday 21 May 2017

Kiran charla about Sarada novels


Post of the day: 22-May-2017:
From Kiran Charla wall: with Suresh K
కొందరు రచయితలు, కొన్ని పుస్తకాల గురించి చాలా కాలంగా వింటూ ఉంటాం.. కానీ, బద్ధకమో, టైం లేకపోవటమో, పుస్తకాలు దొరక్కపోవటమో.. చిన్న చిన్న కారణాలతోనే ఏళ్లు గడిచిపోతాయి. నేనలా ఇన్నేళ్ళుగా చదవని రచయిత శారద( ఎస్. నటరాజన్).
దారిద్య్రం, మానసిక దౌర్బల్యం, స్వార్థం, పిరికితనం, అల్పత్వం... మనుషుల స్వభావాలను ఎలా ప్రభావితం చేస్తాయో...నిస్సహాయ జీవితాలు డబ్బు మూలంగా ఎలాంటి ఒడిదుడుకులకు, సంక్షోభాలకు లోనవుతాయో...శారద రాసిన మంచీ చెడూ, అపస్వరాలు, ఏది సత్యం నవలలు హత్తుకునేలా చెప్తాయి. పార్వతి, వరదరాజులు, సాంబశివరావు....లాంటి పాత్రలు గుర్తుండిపోతాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రోజంతా వదలకుండా చదివిన పుస్తకం కూడా ఇదే. నవలలు అయ్యాయి. కథలు వెతకాలి.. thank you dear anil battula..

-----------------------------------
By Anil battula @
Nice to hear that u too love sarada novels. My blog dedicated to sarada aka Natarajan....http://sahithyabatasarisarada.blogspot.in/
Suresh K , a member of sarada sahithya vedika has kept lot of efforts to bring out sarada works....the above book is published by Rk Perspectives


Kiran charla photo