Thursday, 13 August 2015

"శారద" కథ - హిందీ అనువాదం - శాంతసుందరి

నేను అనువాదం చేసిన "శారద" కథ పంపుతున్నాను . జైపూర్ నుంచి వచ్చే ఒక డైలీ లో ఇది వచ్చింది . అసలు కథ తెలుగు శీర్షిక - "స్వాతంత్ర్య స్వరూపం"
---- శాంతసుందరి

Thanks to Santha sundari garu...:)


శారదను స్మరించుకుందాం...

"శారద సాహిత్య వేదిక", "ఛాయ" నిర్వహణలో 15 -ఆగస్ట్ - 2015 శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్, సొమజిగూడ లో "శారద[యెస్.నటరాజన్]" ను గుర్తుచేసుకుందాం...కలుద్దాం రండి.
Design: Mahy Bezawada







కొ.కు, శారద, త్రి.శ్రీ లను తలుచుకొందాం రండి

సాహితీమిత్రుల నిర్వహణలో 16 - 8 - 15 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మధుమహాలక్ష్మి, మొఘల్ రాజ్ పురం లో కొ.కు, శారద, త్రి.శ్రీ లను తలుచుకొందాం రండి...


Friday, 26 June 2015

శారద రచనలు - మొదటి సంపుటం - నవలలు [ఏది సత్యం, మంచీ చెడూ, అపస్వరాలు]: ప్రచురణ: నవచేతన పబ్లిషింగ్ హౌస్

శారద రచనలు - మొదటి సంపుటం - నవలలు [ఏది సత్యం, మంచీ చెడూ, అపస్వరాలు]:
ప్రచురణ: నవచేతన పబ్లిషింగ్ హౌస్, తెలంగాణ.
ప్రతులు:1000; ముద్రణ: ఫిబ్రవరి 2015; పేజీలు: 500; వెల: 325/-
Free ebook link: http://sahithyabatasarisarada.blogspot.in/2015/03/ebook.html



  ఆలూరి భుజంగరావు గారి రెండవ వర్ధంతి సభ:
-----------------------------------------------------

మిత్రులకు !
ది 21-6-15 నాడు గుంటూరు లో ఆలూరి భుజంగరావు గారి రెండవ వర్ధంతి సభను విప్లవ రచయితల సంఘం నిర్వహించింది . విరసం కార్యవర్గ సభ్యురాలు రుక్మిణి గారు అధ్యక్షత వహించారు . డా . మేడిపల్లి రవికుమార్ గారు ''డా . కేశవరెడ్డి సాహిత్యంలో సామాజిక జీవితం''అన్న అంశం పై ప్రసంగించారు . నాన్నగారు ,నేను కలిసి అనువదించిన "వైజ్ఞానిక భౌతికవాదం"గ్రంధాన్ని నేను (కవిని ఆలూరి ) పరిచయం చేయటం జరిగింది .సభకు విచ్చేసిన పెద్దలకూ ,సాహితీ మిత్రులకూ,శ్రేయోభిలాషులకు ధన్యవాదములు.
నాన్న గారు జీవించి ఉన్నప్పుడే ఈ గ్రంధం వెలువడాలని,గ్రందావిష్కరణలో సాహితీ మిత్రులకు ఈ గ్రంధాన్ని గురించి నాన్నగారు చెపుతుంటే నేనూ వినాలనీ అనుకున్నాను .కానీ వాస్తవం వేరుగా ఉంది . గ్రంధ పరిచయాన్ని నేను చేస్తున్నాను ,సాహితీ మిత్రులు అందరూ ఉన్నారు . తెలుగు పాఠకులకు ఈ గ్రంధాన్ని అందించాలని అనుక్షణం తపించిన నాన్న మాత్రం మన మధ్యన లేరు .
--------- కవిని ఆలూరి

---------------------------------------------------------------------------------