Friday 19 October 2012

శాంతి సాధించారు [రూపకం] [శారద] - తెలుగు స్వతంత్ర 1949

1

2

2 comments:

  1. ఎనానిమస్ పోస్ట్‌కి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    శారద రచనలను నేటి తరానికి అందిస్తున్నండుకు మిమ్మల్ని అభినందించాలి. శారద రచనలు కేవలం సాహిత్యమే కాదు, నేటి గ్లోబలీకరణ పోకడలలో మనిషి మరిచిపోతున్న మానవ జీవన సంఘర్షణలకు సహజమైన చిత్రణ అవి. సెల్‌ఫోనుల్లోనో, ల్యాప్‌టాపుల్లోనో తనని తాను బందీ చేసుకుని సామాజిక సమస్యలు అంటే ఏమిటీ, నా వ్యక్తిగత వైఫల్యాలకి అధిగమించటానికి ఆత్మహత్య కాకుండా మరేమైనా దారులున్నాయా అని వగచే నేటి తరానికి పిజ్జా సెంటర్ల బయట, కార్పొరేట్ చదువులు నేర్పని, నిత్య బాధల జీవనకావ్యంలో వాస్తవ జీవనరీతుల కళాసృజన ఎలా జరుగుతుందో తెలియాలంటే ఈ రచనలు నేటితరానికి అందుబాటులో ఉండటం అవసరం. ఏదో ఒక్క ఆర్ధికమాంద్యమో, ఒక్క ప్రేమ వైఫల్యమో, నిరంతరమైన బాహ్యశక్తుల పీడననో- మనిషి జీవన సరళిని అంతం చేసే అంత గొప్పవి కావు అని శారద తాను జీవిస్తూ, తన జీవితాన్ని అక్షరబద్దం చేస్తూ చూపించాడు. అది చదవటం తెలుగు వారి అదృష్టం అయితే ఆ అవకాశాన్ని ఆన్‌లైన్ పాఠకులకి అందిస్తున్న మీరు అభినందనీయులు.

    ReplyDelete